సరకు రవాణాలో ఏపీ పోర్టులు రెండో స్థానం

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..సరకు రవాణాలో ఏపీ పోర్టులు రెండో స్థానం

రాష్ట్రంలోని పోర్టుల ద్వారా 2025-26లో సుమారు 210 మిలియన్ మెట్రిక్ టన్నుల సరకు రవాణా జరిగింది. దేశంలో నాన్-మేజర్ పోర్టుల సరకు రవాణా సామర్థ్యంలో గుజరాత్ మొదటి స్థానంలో ఉండగా.. ఏపీ రెండో స్థానంలో ఉంది. విశాఖపట్నంలోని మేజర్ పోర్టు, గంగవరం, కాకినాడ డీప్ వాటర్, కృష్ణపట్నం, కాకినాడ యాంకరేజ్, రవ్వ నాన్-మేజర్ పోర్టుల ద్వారా సరకు రవాణా సామర్థ్యం ఏటా సుమారు 327.5 ఎంఎంటీలుగా ఉంది.