ఘోరం.. కుప్పకూలిన 18 అంతస్తుల బిల్డింగ్

భారత్ డిజిటల్ న్యూస్ ఢిల్లీ….ఘోరం.. కుప్పకూలిన 18 అంతస్తుల బిల్డింగ్

కెన్యా రాజధాని నైరోబీలోని ఈస్ట్‌లీ ప్రాంతంలో వెలుగు చూసిన ఘటన

అక్టోబర్ 23న మధ్యాహ్నం 1 గంట సమయంలో కుప్పకూలిన భవనం

నిర్మాణం ఇంకా జరుగుతుండగానే.. పేకమేడలా కూలిపోయిన బిల్డింగ్

భవనం పైభాగంలో నివాసితులు లేరు కానీ.. బేస్‌మెంట్, గ్రౌండ్ ఫ్లోర్‌లో ఎలక్ట్రానిక్స్ షాపులు, ఇతర దుకాణాలు ఉన్నాయి

పలువురు కార్మికులు సైతం అక్కడే ఉన్నారని.. శిథిలాల కింద పలువురు చిక్కుకుని ఉండొచ్చని అనుమానిస్తున్న అధికారులు

సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని.. సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ టీమ్స్

ఇప్పటికే శిథిలాల కింద చిక్కుకున్న ఓ వ్యక్తిని బయటకు తీసి.. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలింపు

భవన నిర్మాణం ప్రమాణాలకు అనుగుణంగా లేదని గుర్తింపు.. బిల్డింగ్ ఓనర్‌పై లీగల్ చర్యలు తీసుకుంటామన్న అధికారులు

ఈ భవనానికి అవసరమైన అనుమతులు ఉన్నాయో లేదో, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందో లేదో దర్యాప్తు షురూ!