భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..అంజిలి పెళ్లి వేదికపై జగన్-షర్మిల మధ్య వివాదం.. లేఖలో కీలక విషయాలు
మేనకోడలు అంజిలి పెళ్లి విషయం తెలిసి సంతోషం వ్యక్తం చేసిన జగన్.. ఆమె జీవితాంతం సంతోషంగా ఉండాలని అక్టోబర్ 9న షర్మిలకు రాసిన లేఖలో ఆకాంక్షించారు.
బెంగళూరులోని తన నివాసంలో పెళ్లి నిర్వహించడంపై జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో అతిథులు, ఫొటోగ్రాఫర్లు, వీడియో బృందాలు రావడం వల్ల భద్రత, గోప్యతకు ముప్పు ఉంటుందని వివరించారు.
తాను ప్రస్తుతం ఆ ఇంట్లోనే నివసిస్తున్నానని, తనతో పాటు కుటుంబ సభ్యుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు జగన్ లేఖలో పేర్కొన్నారు.
తన అభ్యంతరాలను ఇతరుల ద్వారా ఇప్పటికే తెలియజేసినా పట్టించుకోకుండా పెళ్లి నిర్వహణకు ముందుకెళ్లడంపై బాధపడ్డానని షర్మిలకు రాసిన లేఖలో వెల్లడించారు.
పెళ్లికి మరో వేదికను ఎంపిక చేసుకోవాలని కోరిన జగన్.. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్ నివాసంలో వివాహం నిర్వహించుకోవచ్చని ప్రత్యామ్నాయం ఇచ్చారు. ఆ ప్రతిపాదన ఇప్పటికీ కొనసాగుతుందని స్పష్టం చేశారు.

అంజిలి పెళ్లి ప్రత్యేకంగా గుర్తుండిపోయేలా చేసేందుకు సహకరిస్తానని, తన అభిప్రాయాన్ని కూడా అర్థం చేసుకోవాలని జగన్ కోరారు. ఈ లేఖతో జగన్-షర్మిల మధ్య కుటుంబ విభేదాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి.