ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి అందరూ భాగస్వాములు కావాలి.

భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…శ్రీ టి.వి.ఎం. రాందాస్
మండల విద్యాశాఖాధికారి
మండల విద్యాశాఖాధికారి కార్యాలయం, కోడూరు మండలం

కోడూరు మండలంలో మెగా PTM–4.1 ఘనవిజయం

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి అందరూ భాగస్వాములు కావాలి.

గ్రామీణ యువజన వికాస సమితి అధ్యక్షులు శ్రీ మండలి వెంకట్ రామ్

ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ (Mega PTM–4.1) కార్యక్రమం కోడూరు మండలంలోని మొత్తం 45 ప్రభుత్వ పాఠశాలల్లో నేడు ఘనంగా నిర్వహించబడింది. తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారని మండల విద్యాశాఖాధికారి శ్రీ టి.వి.ఎం. రాందాస్ తెలిపారు.

ఉదయం నుంచి నిమిషాల వారీ కార్యాచరణ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. తరగతి గదుల్లో ఉపాధ్యాయులు విద్యార్థుల అభ్యాస పురోగతి, LEAP యాప్, HPC, GFLN కార్యక్రమాలపై తల్లిదండ్రులతో చర్చించారు. అనంతరం విద్యార్థుల ప్రతిభా ప్రదర్శనలు, FLN కిట్లు, TLMలు, STEM/ATL, గ్రంథాలయం, సైన్స్ ప్రాజెక్టుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

అలాగే తల్లిదండ్రుల కోసం నిర్వహించిన పోటీలు, తల్లులకు పాదాభివందనం, ప్రధానోపాధ్యాయుల పాఠశాల ప్రగతి నివేదికలు, LEAP యాప్ ప్రదర్శన, SMC చైర్మన్ల సందేశాలు, ప్రశ్నోత్తర కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. అనంతరం డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం ఏర్పాటు చేశారు.

గ్రామీణ యువజన వికాస సమితి అధ్యక్షులు శ్రీ మండలి వెంకట్ రామ్ గారు ముఖ్య అతిథిగా ZPHS ఉల్లిపాలెం, ZPHS స్వతంత్రపురం, ZPHS కోడూరు, ZPHS లింగారెడ్డిపాలెం పాఠశాలలను సందర్శించి విద్యార్థుల ప్రతిభను అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సమాజం సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. కోడూరు మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో నమోదవుతున్న ఎన్‌రోల్మెంట్ పెరుగుదలను ప్రత్యేకంగా అభినందించారు.

ఎం.ఆర్.ఓ శ్రీ కె.వి. పూర్ణచంద్రరావు గారు, ఇన్‌చార్జి ఎం.డీ.ఓ శ్రీ సత్యనారాయణ గారు, మండల విద్యాశాఖాధికారి శ్రీ టి.వి.ఎం. రాందాస్ గారు పలు పాఠశాలలను సందర్శించి కార్యక్రమాల నిర్వహణను సమీక్షించారు.

ZPHS కోడూరులో తల్లిదండ్రుల క్రీడా పోటీల విజేతలకు స్థానిక రైల్వే కాంట్రాక్టర్ శ్రీ శ్రీనివాసరావు గారు బహుమతులు అందజేశారు. మండలంలోని మిగిలిన పాఠశాలల్లో పంచాయతీ స్పెషల్ ఆఫీసర్లు, SMC చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, దాతలు, పూర్వ విద్యార్థులు ముఖ్య అతిథులుగా పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారు.

ఈ సందర్భంగా మండల విద్యాశాఖాధికారి శ్రీ టి.వి.ఎం. రాందాస్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం ఎంతో కీలకమని, మెగా PTM–4.1కు విశేష స్పందన లభించడం ఆనందదాయకమని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయడానికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, దాతలు, సమాజం అందరూ ఇదే స్ఫూర్తితో సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.