దిల్లీలో నేడు 17 మెట్రోస్టేషన్‌లు మూసివేత

భారత్ డిజిటల్ న్యూస్ ఢిల్లీ..దిల్లీలో నేడు 17 మెట్రోస్టేషన్‌లు మూసివేత

దిల్లీలో కొనసాగుతున్న సీజేపీ ఆందోళనల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా శుక్రవారం 17 మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు.

ప్రయాణికుల రాకపోకలను నియంత్రించేందుకు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

వరుసగా మూడో రోజూ మెట్రో స్టేషన్లు మూసివేయడం గమనార్హం. దీంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను వినియోగించాలని మెట్రో అధికారులు సూచించారు….