హైవే టోల్‌గేట్‌లో డ్రగ్స్‌ పట్టివేతగుజరాత్‌

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..హైవే టోల్‌గేట్‌లో డ్రగ్స్‌ పట్టివేత

గుజరాత్‌లోని అహ్మదాబాద్-వడోదరా హైవేపై ఉన్న టోల్‌గేట్ వద్ద గురువారం పోలీసులు జరిపిన తనిఖీల్లో భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి.

సుమారు రూ.25 కోట్ల విలువైన 4.53 కిలోల హెరాయిన్ మరియు 2.49 కిలోల మెఫిడ్రోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ వ్యవహారంలో డ్రగ్స్ తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ డ్రగ్స్ రవాణా వెనుక ఉన్న నెట్‌వర్క్ గురించి అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు