అవనిగడ్డ జెడ్పీటీసీ అభ్యర్థిగా విక్కుర్తి జయలక్ష్మి నామినేషన్

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..అవనిగడ్డ జెడ్పీటీసీ అభ్యర్థిగా విక్కుర్తి జయలక్ష్మి నామినేషన్

అవనిగడ్డ: అవనిగడ్డ మండల జెడ్పీటీసీ అభ్యర్థిగా కూటమి పార్టీల మద్దతుతో పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి విక్కుర్తి శ్రీనివాసరావు సతీమణి విక్కుర్తి జయలక్ష్మి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. అవనిగడ్డ నుంచి మచిలీపట్నంలోని జిల్లా పరిషత్ కార్యాలయం వరకు ర్యాలీగా తరలివెళ్లిన ఆమె జిల్లా పరిషత్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు . ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కూటమి పార్టీల శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొని జయలక్ష్మికి మద్దతు తెలిపారు.