IND vs NZ: నమన్ ధీర్, శ్రేయస్ అయ్యర్ పోరాటం .. ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచిన భారత్!

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..IND vs NZ: నమన్ ధీర్, శ్రేయస్ అయ్యర్ పోరాటం .. ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచిన భారత్!

న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా శుభారంభం చేసింది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా క్రైస్ట్‌చర్చ్ వేదికగా గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది.

ఓటమి ఖాయమనుకున్న ఈ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్, నమన్ ధీర్ అద్భుతమైన పోరాటం టీమిండియాకు విజయాన్ని అందించింది.

ఫిలిప్స్ పోరాటం వృథా..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 225 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్(40 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 82 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగగా.. ఫిన్ అలెన్(24 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 45), బెవాన్ జాకోబ్స్(16 బంతుల్లో 3 ఫోర్లతో 31) దూకుడుగా ఆడారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసారు.