భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..రేపటి నుంచి స్కూళ్లలో ఐ టెస్టులు.. ఫ్రీగా కళ్లద్దాలు
AP: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల్లోని 43.30 లక్షల మంది విద్యార్థులకు రేపటి నుంచి కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు. దృష్టిలోపం ఉన్నట్లు గుర్తించిన వారిలో 2.50 లక్షల మందికి ఉచితంగా కళ్లద్దాలు అందజేస్తామని వెల్లడించారు. జాతీయ అంధత్వ నివారణ, దృష్టిలోప నియంత్రణ కార్య క్రమంలో భాగంగా 6 నుంచి 18 ఏళ్ల విద్యార్థులందరికీ టెస్టులు చేయనున్నట్లు వివరించారు.

