తెలంగాణలో మద్యం ధరల పెంపు.. ఎల్లుండి నిర్ణయం!

భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..తెలంగాణలో మద్యం ధరల పెంపు.. ఎల్లుండి నిర్ణయం!

తెలంగాణ :

రాష్ట్రంలో మద్యం ధరలు పెరగనున్నాయి. ఎంత మేరకు పెంచాలనేదానిపై ఈ నెల 17న జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.

ధరల నిర్ణయ కమిటీ ఇప్పటికే తయారీ సంస్థలు, అసోసియేషన్ ప్రతినిధులతో చర్చలు జరిపింది.

ఈ మీటింగ్‌లో స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

లిక్కర్ బాటిళ్ల సైజుల్లోనూ మార్పులు చేయాలని కంపెనీలు కోరుతున్నట్లు సమాచారం.

150ml బాటిళ్లను తెచ్చే అంశం పరిశీలనలో ఉన్నట్లు వినిపిస్తోంది.