భారత్ డిజిటల్ న్యూస్ ఢిల్లీ..కుప్పకూలిన విమానం.. 10 మంది మృతి
బహామాస్‌లో సెస్నా 402 రకానికి చెందిన చిన్న విమానం కూలిపోవడంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. నాసావు నుండి శాన్ ఆండ్రోస్ వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై ప్రధాని ఫిలిప్ బ్రేవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దీంతో ముందుజాగ్రత్త భద్రతా చర్యగా ‘ఫ్లెమింగో ఎయిర్’ విమాన సర్వీసుల లైసెన్స్‌ను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసి, దర్యాప్తుకు ఆదేశించింది.

