MPTC, ZPTC ఎన్నికలకు నేటి నుంచి ఈ నెల 23 వరకు నామినేషన్ల స్వీకరణ

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు…..MPTC, ZPTC ఎన్నికలకు నేటి నుంచి ఈ నెల 23 వరకు నామినేషన్ల స్వీకరణ

✍️ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్న పోలీసు అధికారులు

ఈరోజు ఉదయం 11 గంటల నుంచి కోడూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీ జడ్పిటిసి అభ్యర్థుల నామినేషన్లు స్వీకరించనున్నారు.

నామినేషన్ల సమయంలో రాజకీయ పార్టీలకు ఎటువంటి విభేదాలు తలెత్తకుండా కోడూరు ఎస్సై కే.నాగరాజు ఉన్నతాధికారుల సూచనలతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున కోడూరు మండల పరిషత్ కార్యాలయం దగ్గర 100 మీటర్ల లోపు ఎవరు గుంపులుగా ఉండకూడదని సభలకు, ర్యాలీలకు తప్పనిసరిగా అనుమతి ఉండాలని సూచించారు.

నామినేషన్ ప్రక్రియలో జరిగే సమయంలో ఎవరైనా ఘర్షణలకు పాల్పడితే వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.