భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు…..స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి బలాన్ని నిరూపిస్తాం
అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి బలాన్ని నిరూపించి, అన్ని స్థానాల్లో విజయ దుందుభి మోగిస్తామని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అన్నారు.
సోమవారం బర్రింకలపాడులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పోలవరం నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి బలంగా ఉందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై మూడు పార్టీల ముఖ్య నాయకులతో చర్చించినట్లు వెల్లడించారు. ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేసి అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థులను గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంతో పాటు పోలవరం నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయంతో గ్రామాల్లో మరింత అభివృద్ధి సాధిస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ ఇంచార్జ్, ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాస్, కూటమి నాయకులు శీలం వెంకటేశ్వరరావు, జయవరపు శ్రీరామమూర్తి, పిన్నమనేని మధు, నాయుడు రామకృష్ణ గౌడ్, మొగపర్తి సోంబాబు, పారెపల్లి రామారావు, ఉండవల్లి సోమసుందరం, సుంకవల్లి సాయి, పూసం అంజిబాబు, జట్ల సత్యనారాయణ, తొమ్మిదేళ్ల శ్రీనివాస్, చింతలపూడి నవీన్, బండారు అనిల్, పూనెం రాజా, ఏసుబాబు, పోతురాజు, కొప్పుల శ్రీకాంత్, సంజయ్, గోపాలకృష్ణ, మధు, చిరంజీవి, శ్రీనివాస్ తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు.