సి ఇ సి జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..సి ఇ సి జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి

Sir ను రద్దు చేయాలి
.. సిపిఎం డిమాండ్

సిఈసి జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని, ఎస్ ఐ ఆర్ ను రద్దు చేయాలని, యూపీఐ చెల్లింపులపై చార్జీలను ఉపసంహరించుకోవాలని, ధరల పెరుగుదలను నియంత్రించాలని, భోలక్ పూర్ డివిజన్ పరిధిలోని స్థానిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిపిఐ ఎం భోలక్ పూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రాగ టూల్స్ చౌరస్తా దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఐ ఎం ముషీరాబాద్ జోన్ కార్యదర్శి ఆర్. వెంకటేష్ మాట్లాడుతూ ఎస్ ఐ ఆర్ పేరుతో కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ అర్హులైన ఓట్లను తొలగిస్తున్న సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ను వెంటనే తొలగించాలని, తొలగించిన ఓటర్లను తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యవసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, కేంద్ర ప్రభుత్వం ధరల పెరుగుదలను అరికట్టడంలో విఫలమైందని విమర్శించారు. యూపీఐ చెల్లింపులపై చార్జీలు వసూలు చేయాలని నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, భోలక్ పూర్ డివిజన్ పరిధిలో ఉన్న అర్హులైన పేదలందరికీ ప్రభుత్వమే ఉచితంగా ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జోన్ కార్యదర్శివర్గ సభ్యులు బాబు, ఎం కృష్ణ స్వామి, పి వెంకటేష్, వీర చారి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

ధన్యవాదములతో,

R E బాబు
కార్యదర్శి వర్గ సభ్యులు సిపిఐ ఎం ముషీరాబాద్ జోన్ కమిటీ