నాడు ఎన్నికల కమిషనర్‌నే తప్పించారు.. నేడు ప్రజాస్వామ్యంపై నీతులా జగన్?

భారత్ డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…..నాడు ఎన్నికల కమిషనర్‌నే తప్పించారు.. నేడు ప్రజాస్వామ్యంపై నీతులా జగన్?అధికారంలో ఉన్నప్పుడు అరాచక ఆరోపణలపై మౌనం.. నేడు రాజ్యాంగం గుర్తొచ్చిందా జగన్?మాచర్లలో బోండా ఉమ, బుద్ధా వెంకన్నలపై జరిగిన దాడికి బాధ్యులెవరు?

  • Ammiraju Udaya Shankar.sharma News Editor.పుంగనూరు నుంచి నెల్లూరు వరకు ప్రతిపక్ష అభ్యర్థులపై జరిగిన దాడులకు సమాధానం చెప్పండి
  • వైసీపీ హయాంలో ప్రాణరక్షణే ప్రశ్నార్థకమై పరిషత్ ఎన్నికలను బహిష్కరించాల్సి వచ్చిన పరిస్థితి మరిచిపోయారా?
  • నిమ్మగడ్డ రమేష్‌కుమార్ పదవీకాలాన్ని కుదించిన మీరా ఎన్నికల సంఘం స్వతంత్రత గురించి మాట్లాడేది?
  • 35 నామినేషన్ అడ్డంకులు, 23 బలవంతపు ఉపసంహరణలు, 55 హింసాత్మక ఘటనల ఆరోపణలపై ఏం చర్యలు తీసుకున్నారు?
  • ప్రజాస్వామ్యం అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక నీతి.. నేడు మరో నీతా?
  • రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

అమరావతి, అక్టోబర్ 18, 2026: ప్రజాస్వామ్యం ఉందా? రాజ్యాంగబద్ధ పాలన సాగుతోందా? రాష్ట్రంలో చట్టం, న్యాయం పనిచేస్తున్నాయా? అంటూ గొడ్డలి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాజా మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో స్పందించారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా, నేడు మరో విధంగా ప్రజాస్వామ్యాన్ని నిర్వచించడం తగదని పేర్కొన్నారు. నేడు ఎన్నికల సంఘం, పోలీసు యంత్రాంగం, నామినేషన్ల ప్రక్రియపై జగన్ సంధిస్తున్న ప్రశ్నలనే 2020 స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి అడిగారని గుర్తుచేశారు. ఆనాడు ప్రతిపక్ష అభ్యర్థులపై దాడులు, బెదిరింపులు, నామినేషన్ పత్రాల ధ్వంసం, బలవంతపు ఉపసంహరణలపై వచ్చిన ఫిర్యాదులకు నాటి ప్రభుత్వం ఇచ్చిన సమాధానమేమిటని నిలదీశారు. ప్రజాస్వామ్య పరిరక్షణపై ఉపన్యాసాలు ఇచ్చే ముందు గత ఐదేళ్ల పాలనలో చోటుచేసుకున్న వివాదాలపై జగన్ ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

పరిషత్ ఎన్నికలనే బహిష్కరించాల్సి వచ్చిన పరిస్థితి మరిచిపోయారా?

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడం కంటే కార్యకర్తల ప్రాణాలను కాపాడుకోవడమే ప్రధాన సమస్యగా మారిందని నాటి పరిస్థితులను అచ్చెన్నాయుడు గుర్తుచేశారు. గ్రామస్థాయి నుంచి నియోజకవర్గస్థాయి వరకు ప్రతిపక్ష అభ్యర్థులు ఎదుర్కొన్న బెదిరింపులు, భౌతిక దాడులు, నామినేషన్ల అడ్డగింతలపై ఎన్నో ఫిర్యాదులు చేసినా స్వేచ్ఛాయుత వాతావరణం నెలకొంటుందనే విశ్వాసం కలగలేదని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియపై తీవ్ర అభ్యంతరాలు, రాష్ట్ర ఎన్నికల సంఘం వ్యవహారశైలిపై అపనమ్మకం నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించిందని తెలిపారు. దాదాపు నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన పార్టీ ఇలాంటి అసాధారణ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటే పరిస్థితుల తీవ్రతను అర్థం చేసుకోవాలని అన్నారు. నాడు తమ అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి రక్షణ కోరినప్పుడు స్పందించని వైసీపీ నాయకత్వం ఇప్పుడు అదే సమస్యలను ప్రస్తావించడం రాజకీయ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు.

మాచర్లలో ప్రతిపక్ష నేతలపై దాడి జరిగినప్పుడు చట్టం ఎక్కడుంది జగన్?