భారీగా తగ్గనున్న క్యాన్సర్ మందుల ధరలు

భారత్ డిజిటల్ న్యూస్ నల్గొండ..భారీగా తగ్గనున్న క్యాన్సర్ మందుల ధరలు

క్యాన్సర్ నిరోధక మందుల ధరల నియంత్రణకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

గుర్తించిన 137 నాన్-షెడ్యూల్డ్ మెడిసిన్లపై ట్రేడ్ మార్జిన్ను గరిష్ఠంగా 30 శాతానికి పరిమితం చేయాలని నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ(NPPA) ఆదేశించింది.

దీంతో ఆ మందుల ధరలు 70% వరకు తగ్గనున్నాయి.

సవరించిన ధరలు నవంబర్ 9 నుంచి అమల్లోకి రానున్నాయి.

వీటిలో రొమ్ము, ప్రొస్టేట్, పెద్ద పేగు, గర్భాశయ క్యాన్సర్ మందులూ ఉన్నాయి.