ఏపీలో కూటమి సీట్ల సర్దుబాటు కొలిక్కి???

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..ఏపీలో కూటమి సీట్ల సర్దుబాటు కొలిక్కి???

ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ కూటమి మధ్య సీట్ల సర్దుబాటు దాదాపు పూర్తయింది. విజయవాడ, కాకినాడ, శ్రీకాకుళం, ఏలూరు, ఒంగోలు, తిరుపతి కార్పొరేషన్లలో 4 చోట్ల జనసేన పోటీ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా 18-24 మున్సిపాలిటీలు, 3-4 నగర పంచాయతీల్లో కూడా పోటీకి సిద్ధమవుతున్నాయి. బీజేపీ పార్టీ కూడా ఓ కార్పొరేషన్, 4-5 మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీలో పోటీ చేసే అవకాశముందని సమాచారం.