శ్రీశైలంలో భక్తుల కోసం వినూత్న సాంకేతిక సేవలు!

భారత్ డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం….శ్రీశైలంలో భక్తుల కోసం వినూత్న సాంకేతిక సేవలు!

శ్రీశైల మహాక్షేత్రంలోని స్థలపురాణం, చారిత్రక విశేషాలు, ఆలయ నిర్మాణశైలి గురించి తెలుసుకునేందుకు QR కోడ్ బోర్డులను ఏర్పాటు చేశారు.

QR కోడ్ స్కాన్ చేస్తే ఆడియో, టెక్స్ట్ రూపంలో సమాచారం

ఏకంగా 130 భాషల్లో వివరాలు తెలుసుకునే అవకాశం

NIVU కృత్రిమ మేధస్సు ఆధారంగా సేవలు

క్షేత్ర పరిధిలోని సుమారు 60 ప్రాంతాల్లో QR బోర్డుల ఏర్పాటు

సాక్షిగణపతి, హాటకేశ్వరం, ఫాలధార-పంచధార, శిఖరేశ్వరం, పంచమఠాల వద్ద ప్రత్యేక బోర్డులు
భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు చారిత్రక విశేషాలను సులభంగా అందించడమే ఈ కార్యక్రమం లక్ష్యం.