జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆహ్వానం

భారత్ డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం….జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆహ్వానం

రేపు కొణిదల నాగబాబు గారి పర్యటన

13-10-2026వ తేదీ:-

ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ & రీఫారెస్టేషన్ ఫర్ ఎకొలాజికల్ ఎన్రిచ్ మెంట్ చైర్మన్, శాసన మండలి సభ్యులు గౌరవనీయులైన శ్రీ కొణిదల నాగబాబు గారు సముద్ర తీర ప్రాంతంలో క్షీణించిన మడ అడవుల పునరుద్దరణ దశ-2 మొక్కలు పెట్టే కార్యక్రమంలో భాగంగా నాగాయలంక మండలం సంగమేశ్వరం గ్రామానికి విచ్చేయనున్నారు.

ర్యాలీ:-
రేపు అనగా మంగళవారం ఉదయం 9గంటలకు జీలగలగండి వద్ధ ప్రారంభం. అవనిగడ్డ, భావదేవరపల్లి మీదుగా సంగమేశ్వరం సముద్రతీరం వరకూ ర్యాలీ జరుగుతుంది.

మడ మొక్కలు నాటే కార్యక్రమం

సంగమేశ్వరం సముద్రతీరంలో శ్రీ కొణిదల నాగబాబు గారు, అవనిగడ్డ ఎమ్మెల్యే శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు, ఉన్నత అధికారులతో కలిసి ప్రజా ప్రగతి సేవా సంఘం ఆధ్వర్యంలో మడ మొక్కలు నాటి కార్యక్రమం ప్రారంభిస్తారు.

అనంతరం అవనిగడ్డ మండలం అశ్వారావుపాలెంలో స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు గారి నూతన విగ్రహం, మినీ పార్క్ ప్రారంభించి, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

కావున ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో విచ్చేసి విజయవంతం చేయగలరని విజ్ఞప్తి

ఇట్లు
అవనిగడ్డ శాసనసభ్యుల వారి కార్యాలయం