రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం.. 3 రోజులు వర్షాలు!

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం.. 3 రోజులు వర్షాలు!

ఆగ్నేయ బంగాళాఖాతంలో మంగళవారం అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది మూడు, నాలుగు రోజుల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఈనెల 14 నుంచి కోస్తాంధ్ర, రాయలసీమల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు. అయితే తెలంగాణలో ప్రస్తుతానికి పొడి వాతావరణం కొనసాగుతుందని పేర్కొన్నారు.