టీటీడీకి రూ.10 లక్షల విరాళం

భారత్ డిజిటల్ న్యూస్ భక్తి///టీటీడీకి రూ.10 లక్షల విరాళం

తిరుమల: టీటీడీకి భక్తుల విరాళాల పరంపర కొనసాగుతోంది. బర్డ్ ట్రస్ట్ కు రూ.10 లక్షల విరాళం అందజేశారు.

తిరుమల ఆలయ రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడుకు దాత తాడిపత్రికి చెందిన హర్షవర్ధన్ రెడ్డి తరపున విరాళం డీడీని బోర్డు సభ్యుడు నన్నపనేని సదాశివరావు అందజేశారు.

ఈ సందర్భంగా దాతకు టీటీడీ చైర్మన్ కృతజ్ఞతలు తెలిపారు.