(భారత్ డిజిటల్ న్యూస్) పాకాల,అక్టోబర్09. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో గ్రామ పంచాయతీల లోని పోలింగ్ కేంద్రాలను పాకాల సీ.ఐ టి.చిన్న గోవిందు,ఎంపీడీఓ వాసుదేవరావు,రెవెన్యూ అధికారులు కళ్యాణ్,వినోద్ సాయి కలిసి శుక్రవారం పరిశీలించారు.ఈ సందర్భంగా పాకాల ఎంపీడీఓ వాసుదేవరావు,పాకాల సీ.ఐ టీ.చిన్న గోవిందు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ మరియు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఏర్పాటు చేసి నిర్ధారించిన పోలింగ్ స్టేషన్ లను పరిశీలించడం జరిగిందని తెలిపారు.రాబోయే ఎంపీటీసీ,జడ్పిటిసి ఎన్నికల నిమిత్తంక ఓటర్ల జాబితా ప్రచురించడం జరిగిందని,మొత్తం ఓటర్లు 44,173 మంది ఉన్నారు.మండలంలో 16 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయని చెప్పారు.అన్ని పోలింగ్ స్టేషన్ లను ప్రాథమిక పాఠశాల,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,గ్రామపంచాయతీలో ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పారు.పోలింగ్ స్టేషన్ లను ప్రభుత్వ భవనాలలోనే ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు.రాబోయే ఎన్నికల దృష్ట్యా గ్రామ పంచాయతీ కార్యాలయాలలో పోలింగ్ కేంద్రాల వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా పరిశీలించి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని పాకాల సి.ఐ టి.చిన్న గోవిందు పేర్కొన్నారు. పాకాల ఎస్.ఐలు సి.తరుణ్,నాగ మంజుల,ఏ.ఎస్.ఐ దయాకర్,పోలీస్ సిబ్బంది,రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
