118 సవర్ల నగల చోరీ కేసులో ట్విస్ట్.. భర్త, పిల్లలతో యూట్యూబర్ మధుమిత పరార్

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు…..118 సవర్ల నగల చోరీ కేసులో ట్విస్ట్.. భర్త, పిల్లలతో యూట్యూబర్ మధుమిత పరార్

ఇంట్లో 118 సవర్ల బంగారు నగలు చోరీకి గురైన ఘటనలో యూట్యూబర్ మధుమిత పేరు తెరపైకి వచ్చింది. ఇటీవల నగలు, నగదుకు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేసిన నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరోవైపు, తన 5 సవర్ల బంగారు గొలుసును మధుమిత దోచుకుందని తిరునెల్వేలికి చెందిన ఓ కాంట్రాక్టర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ విషయం తెలుసుకున్న మధుమిత.. పోలీసుల దర్యాప్తుకు భయపడి ఇంటికి తాళం వేసి భర్త, పిల్లలతో కలిసి పరారైనట్లు సమాచారం. ఆమె ఎక్కడికి వెళ్లిందన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.