భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..

పత్తి పంటలో గంజాయి సాగు.. 51 మొక్కలు స్వాధీనం!

నేరడిగొండ మండలం అరేపల్లి శివారులో పత్తి పంట మధ్య గంజాయి సాగు చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు.. సిడాం గంగారాం (60) సాగు చేస్తున్న 51 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు.

మొక్కల విలువ సుమారు రూ.5.10 లక్షలుగా పోలీసులు అంచనా వేశారు. గంగారాంను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు….