కరీంనగర్ జిల్లాలో ముగ్గురు పోలీసులపై సస్పెన్షన్ వేటు….

భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..కరీంనగర్ జిల్లాలో ముగ్గురు పోలీసులపై సస్పెన్షన్ వేటు….

కరీంనగర్ జిల్లాలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ బొల్లం రమేష్, ఎస్ఐ అన్వర్, కానిస్టేబుల్ అజీజోద్దిన్‌లను పోలీస్ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.

అక్రమంగా మట్టి తరలించే వారి నుంచి రూ.50 వేలు తీసుకున్నారనే ఆరోపణలపై బాధితుడి ఫిర్యాదుతో విచారణ జరిపిన అనంతరం ఈ చర్యలు తీసుకున్నారు. నిన్న వీరిని ఏఆర్‌కు అటాచ్ చేస్తూ బదిలీ చేసిన సీపీ, విచారణ నివేదిక ఆధారంగా గురువారం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు….