భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..అగ్రిగోల్డ్ బాధితులు, డిపాజిటర్లు, ఏజెంట్లు ఒరిజినల్ బాండ్లను పరిశీలనకు తీసుకురావాలి
08.10.2026 వ తేది నుండి ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 05 గంటల వరకు పనిదినాలలో పరిశీలన ప్రక్రియ
క్రైమ్ న్యూస్ కృష్ణా :
అగ్రిగోల్డ్ డిపాజిటర్లు, బాధితులు మరియు ఏజెంట్లకు న్యాయం అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక మంత్రుల బృందం నిర్ణయం మేరకు, అగ్రిగోల్డ్ బాండ్లు మరియు సంబంధిత పత్రాల పరిశీలన, నమోదు ప్రక్రియ కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.
ఈ ప్రక్రియలో భాగంగా CID డీజీ గారి ఆదేశాల మేరకు, కృష్ణ జిల్లా Sp గారి సహకారం తో కృష్ణా జిల్లా పోలీస్ కార్యాలయం మచిలీపట్నం నందు CID మరియు స్థానిక పోలీస్ బృందాల చే 08.10.2026 ఉదయం 10 గంటల నుంచి ప్రత్యేక అగ్రిగోల్డ్ బాండ్ పరిశీలన జరుగును. కావున పై కేంద్రము నకు హాజరయ్యే డిపాజిటర్లు, చట్టబద్ధ వారసులు మరియు ఏజెంట్లు సంబంధిత ఒరిజినల్ బాండ్లను పరిశీలన కోసం తప్పనిసరిగా తీసుకురావాలి. మరియు వాటి కలర్ జిరాక్స్ ప్రతులపై సంతకం చేసి సదరు బృందలకు సమర్పించి రసీదు పొందాలని కృష్ణా జిల్లా పోలీస్ కార్యాలయం మచిలీపట్టణం నుండి తెలియజేయుచున్నాము..
వాటి పూర్తి వివరములు
డిపాజిటర్ జీవించి ఉన్నట్లయితే
ఒరిజినల్ బాండ్, కలర్ జిరాక్స్, ఆధార్/గుర్తింపు కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్ మొదటి పేజీ, పాస్‌పోర్ట్ సైజు ఫోటో, మొబైల్ నంబర్ మరియు ఏజెంట్ వివరాలు (తెలిసినట్లయితే) తీసుకురావాలి.
డిపాజిటర్ మరణించి, నామినీ జీవించి ఉన్నట్లయితే

పై పత్రాలతో పాటు డిపాజిటర్ మరణ ధృవీకరణ పత్రం, నామినీ గుర్తింపు పత్రాలు, కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం/రేషన్ కార్డు మరియు నామినీ బ్యాంక్ ఖాతా వివరాలు సమర్పించాలి.
డిపాజిటర్ మరియు నామినీ ఇద్దరూ మరణించినట్లయితే
ఇద్దరి మరణ ధృవీకరణ పత్రాలు, చట్టబద్ధ వారసుడి ఆధార్, పాన్, బ్యాంక్ ఖాతా వివరాలు, కుటుంబ సభ్యుల/చట్టబద్ధ వారసత్వ ధృవీకరణ పత్రం మరియు ఇతర సంబంధిత పత్రాలు సమర్పించాలి.
డిపాజిటర్ స్వయంగా పరిశీలన కేంద్రానికి హాజరు కాలేని పరిస్థితిలో
డిపాజిటర్ పత్రాలతో పాటు హాజరయ్యే కుటుంబ సభ్యుడి గుర్తింపు పత్రం, కుటుంబ సంబంధాన్ని నిర్ధారించే పత్రం మరియు డిపాజిటర్ ఇచ్చిన అధికారిక లేఖను సమర్పించాలి.
▪️ఏజెంట్లు సమర్పించే ప్రతి ఒరిజినల్ బాండ్‌ను పరిశీలనకు చూపించి, దాని కలర్ జిరాక్స్, బాండ్ ఐడెంటిఫికేషన్ నంబర్, ఏజెంట్ ఆధార్, పాన్, బ్యాంక్ పాస్‌బుక్, ఫోటో, మొబైల్ నంబర్ మరియు ఏజెంట్ కోడ్ వివరాలను అందించాలి.
ముఖ్యమైన నిబంధనలు సూచనలు
ఒరిజినల్ బాండ్లు పరిశీలన కోసం మాత్రమే చూపించాలి; వాటిని అధికారులకు అప్పగించాల్సిన అవసరం లేదు. సమర్పించే కలర్ జిరాక్స్ ప్రతులపై సంబంధిత డిపాజిటర్/నామినీ/చట్టబద్ధ వారసుడు సంతకం చేయాలి. బ్యాంక్ ఖాతా పేరు, ఖాతా సంఖ్య, IFSC కోడ్ స్పష్టంగా కనిపించేలా పత్రాలు సమర్పించాలి. సంబంధిత బ్యాంక్ ఖాతాకు మొబైల్ నంబర్ అనుసంధానమై ఉండాలి.
డిపాజిటర్ల నుంచి స్వీకరించిన పత్రాలకు ధృవీకరణ రశీదు అందజేయబడుతుంది.
08.10.2026 తేదీ నుండి మచిలీపట్టణం జిల్లా పోలీస్ కార్యాలయం నందు పని దినాలలో ఉదయం 10.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు పరిశీలన ప్రక్రియ నిర్వహించబడుతుంది.
అగ్రిగోల్డ్ బాధితులు, డిపాజిటర్లు మరియు ఏజెంట్లు తమ వద్ద ఉన్న సంబంధిత ఒరిజినల్ బాండ్లు, పత్రాలను సిద్ధంగా ఉంచుకొని,పై తేదీ అనగా 08.10.2026 ఉదయం 10 గంటల నుండి పనిదినాలలో హాజరై ఈ ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పోలీస్ కార్యాలయం నుండి విజ్ఞప్తి.