భారత్ డిజిటల్ న్యూస్ ఢిల్లీ….న్యూ ఢిల్లీ :
సుప్రీంకోర్టు కొత్త జడ్జీలు.. నేడు ప్రమాణస్వీకారం
తెలంగాణ, గుజరాత్, ఢిల్లీ హైకోర్టుల చీఫ్ జస్టిస్‌లు జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ సునీతా అగర్వాల్, జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయలకు సుప్రీంకోర్టు జడ్జీలుగా పదోన్నతి లభించింది. కేంద్ర నోటిఫికేషన్ మేరకు వీరు నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నియామకాలతో సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తితో (CJI) కలిపి జడ్జీల సంఖ్య 37కు చేరుకుంటుంది.
