భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..ఎల్బీనగర్ ACP కృష్ణయ్య సస్పెండ్..!!
ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య పై వేటు పడింది. పలు అవినీతి, అక్రమ ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఉన్నతాధికారులు ఆయన్ను సస్పెండ్ చేశారు. కొన్ని రోజుల క్రితం సస్పెన్షన్ వేటు తప్పదన్న సమయంలో కృష్ణయ్య ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. అనంతరం డిశ్చార్జి అయి విధుల్లో చేరిన వెంటనే ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఆరోపణలపై శాఖాపరమైన విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం..!!
