45 పైసలకు రూ.10 లక్షల రైలు ప్రయాణ బీమా.. ఐఆర్సీటీసీ ఆఫర్

భారత్ డిజిటల్ న్యూస్ నల్గొండ..45 పైసలకు రూ.10 లక్షల రైలు ప్రయాణ బీమా.. ఐఆర్సీటీసీ ఆఫర్

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) భారతీయ రైల్వే ప్రయాణికులకు కేవలం 45 పైసలకే రూ.10 లక్షల వరకు ప్రయాణ బీమాను అందిస్తోంది.

ఈ పథకం రైలు ప్రమాదాల్లో గాయపడిన వారికి రూ.2 లక్షల వరకు, పాక్షిక వైకల్యానికి రూ.7.5 లక్షల వరకు, శాశ్వత వైకల్యానికి లేదా మరణానికి రూ.10 లక్షల వరకు కవరేజీని అందిస్తుంది.