విశాఖ QUBAA Pubలో అర్ధరాత్రి బిగ్ ఫైట్..!

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..విశాఖ QUBAA Pubలో అర్ధరాత్రి బిగ్ ఫైట్..!

విశాఖ బీచ్ రోడ్‌లోని QUBAA Pubలో ఆదివారం అర్ధరాత్రి రెండు వర్గాల మధ్య గొడవ జరిగినట్లు సమాచారం. ఒక్కసారిగా ఇరువర్గాలు ఘర్షణకు దిగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. గొడవకు సంబంధం ఉన్న కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

గొడవకు అసలు కారణం ఏంటి.. ఎంతమంది పాల్గొన్నారు.. పోలీసుల తదుపరి చర్యలు ఏంటి అనేది తెలియాల్సి ఉంది.

-వైజాగ్ వర్మ..