సికింద్రాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌ ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో సంచలన విషయాలు

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..సికింద్రాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌ ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో సంచలన విషయాలు

-10 రోజుల పోలీస్‌ కస్టడీలో మల్లేష్‌ నుంచి కీలక సమాచారం రాబట్టిన పోలీసులు
-మల్లేష్‌ కన్ఫెషన్‌ స్టేట్‌మెంట్‌లో విస్తుపోయే అంశాలు
-2009లో ఆర్మీలో చేరిన మల్లేష్‌కు ఆయుధాలు, మందుగుండు సామాగ్రిపై ప్రత్యేక శిక్షణ
-ఏ కంటోన్మెంట్‌లో పనిచేసినా ఆయుధాగారం బాధ్యతలు నిర్వహించిన మల్లేష్‌
-విధుల్లో నిర్లక్ష్యంతో పలుమార్లు ఉన్నతాధికారుల క్రమశిక్షణ చర్యలు
-2022లో కలకత్తా బ్యారక్‌పూర్‌లో అక్రమ ఆయుధాల వ్యాపారి అవల్‌ దెయ్‌ @ ఓబీతో పరిచయం
-బీర్బల్‌ షా ద్వారా అవల్‌ దెయ్‌ను పరిచయం చేసుకున్న మల్లేష్‌.. రూ.10 వేలకు తుపాకీ కొనుగోలు
-2007లోనే ఆమ్రాబాద్‌, అచ్చంపేట ప్రాంతాల్లో ఇళ్ల దొంగతనాల కేసుల్లో నిందితుడిగా మల్లేష్‌
-2025లో ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఆర్మీ ఆయుధాల చోరీకి తొలి ప్రణాళిక
-2025 లో వెబ్‌సిరీస్‌లు, బ్యాంకు-బంగారు దుకాణాల దోపిడీ వీడియోలతో ప్రేరణ పొంది చోరీకి స్కెచ్‌
-జూలై 2026లో మద్రాస్‌ రెజిమెంట్‌లో పలుమార్లు రెక్కీ నిర్వహించిన మల్లేష్‌
-శేషులు, ప్రవీణ్‌, వినోద్‌ సహకారంతో సీసీ కెమెరాలు, విద్యుత్‌ దీపాలు, జవాన్ల కదలికలపై పక్కా ప్లాన్‌
-యాక్టివా, బ్రీజా కారులో ఆయుధాలు తరలించి నాగర్‌కర్నూల్‌లోని ఇంట్లో దాచిన మల్లేష్‌
-కలకత్తా బీర్బల్‌ షా ద్వారా అవల్‌ దెయ్‌ @ ఓబీకి ఆయుధాలు విక్రయించేందుకు ఒప్పందం
-బీర్బల్‌ షాకు బంగ్లాదేశ్‌ నుంచి కలకత్తాకు వచ్చే వ్యక్తులతో సంబంధాలున్నట్లు పోలీసుల అనుమానం..
-బీర్బల్‌ షా, అవల్‌ దెయ్‌ @ ఓబీకి దేశవ్యాప్తంగా అక్రమ ఆయుధాల నెట్‌వర్క్‌ ఉన్నట్లు పోలీసుల గుర్తింపు.. వారి కోసం గాలిస్తున్న పోలీసులు.