భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..ఎస్ఎంసి కమిటీలలో వలె స్థానిక సంస్థల ఎన్నికలలోనూ ఏకపక్షంగా విజయం సాధించాలి.
పాఠశాల విద్యా కమిటీ ఎన్నికలలో వలె స్థానిక సంస్థల ఎన్నికలలోనూ ఏకపక్షంగా కూటమి అభ్యర్థులు విజయం సాధించాలని తెలుగుదేశం పార్టీ అవనిగడ్డ నియోజకవర్గ ఇంచార్జ్ విక్కుర్తి వెంకట శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.
మండల కేంద్రమైన మోపిదేవిలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నూతనంగా గెలుపొందిన పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ లకు సన్మాన కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం ఏర్పాటు చేశారు.
విక్కుర్తి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన, స్థానిక నేతలతో కలిసి మండలంలోని పాఠశాలల విద్యా కమిటీ చైర్మన్ లను విక్కుర్తి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు లు ఘనంగా సత్కరించారు. నూతనంగా ఎన్నికైన వారందరికీ విక్కుర్తి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా విక్కుర్తి మాట్లాడుతూ, విద్యా కమిటీ చైర్మన్ ఎంపికకు కూటమి పార్టీలకు చెందిన నేతలు చూపించిన తీరు అభినందనీయమన్నారు. విద్యాశాఖ మంత్రి, యువనేత నారా లోకేష్ సారథ్యంలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పటిష్టంగా ముందుకు వెళుతుందన్నారు. విద్యా వ్యవస్థలో నూతన సంస్కరణలు తీసుకువచ్చి, విద్యాభివృద్ధికి నారా లోకేష్ కృషి చేస్తున్నారని కొనియాడారు. పాఠశాల విద్యా కమిటీ ఎన్నికలలో వలె త్వరలో జరగబోవు స్థానిక సంస్థల ఎన్నికలలో సైతం కూటమి పార్టీల అభ్యర్థులు ఏకపక్షంగా విజయం సాధించి, అభివృద్ధికి నిదర్శనంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ లకు బహుమతిగా ఇద్దామని విక్కుర్తి అన్నారు.