కేంద్రం వాటా నేరుగా అకౌంట్లలో జమ

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.కేంద్రం వాటా నేరుగా అకౌంట్లలో జమ

ఏపీ రాష్ట్రంలో 62 లక్షల మందికి సామాజిక భద్రతా పింఛన్లు అందుతుండగా, నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ (NSAP) కింద 9.34 లక్షల మందికి కేంద్రం రూ.382 కోట్లు కేటాయిస్తోంది. అక్టోబర్ 1 నుంచి లబ్ధిదారుల కేంద్ర వాటా (రూ.200-రూ.500) నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ కానుంది. మిగిలిన నగదును ఇళ్ల వద్దే అందజేస్తారు. సదరు లబ్ధిదారులు ఆధార్ లింక్ అయిన ఖాతాలను యాక్టివేట్ చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది…