నేటితో ముగియనున్న తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాలు

భారత్ డిజిటల్ న్యూస్ తిరుపతి..నేటితో ముగియనున్న తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుమలలో నేటితో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఈరోజు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించారు. రాత్రి ధ్వజావరోహణంతో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి. రేపటి నుంచి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు పునఃప్రారంభం కానున్నాయి. గురువారం సాయంత్రం 4 గంటల నుంచి తిరుపతిలో సర్వదర్శనం టోకెన్ల జారీ మొదలవుతుంది.