మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధరలు

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధరలు

పసిడి ప్రియులకు బంగారం ధరలు మళ్లీ షాక్ ఇచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బుధవారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల ప‌సిడి ధర రూ.800 పెరిగి రూ.1,41,350కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.870 ఎగబాకి రూ.1,54,200 పలుకుతోంది. కేజీ వెండి ధర రూ. 2,55,000 వద్ద కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇవే ధ‌ర‌లు ఉండనున్నాయి..