మానవత్వం మంట కలిసింది..బంధాలు, బంధుత్వాలు

భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..మానవత్వం మంట కలిసింది..బంధాలు, బంధుత్వాలు అనేవి లేకుండా ఆస్తి కోసం తమ్ముడినే నమ్మించి సుపారీ ఇచ్చి కిరాయి హాంతకులచే నరికించి,మృతదేహాన్ని అటవీ ప్రాంతంలో తగలబెట్టిన ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది….

కోటపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ లో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు వివరాలు వెల్లడించారు….

నీల్వాయి గ్రామానికి చెందిన కుడుకుల శ్రీనివాస్,రాజేష్ ఇద్దరు అన్నదమ్ములకు గత కొంతకాలంగా భూములు,ఇళ్ల స్థలాల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయని,తమ్ముడైన శ్రీనివాస్ ని అడ్డుతొలగించేందుకు రాజేష్ పక్కా ప్లాన్ రచించి రూపకల్పన చేశాడని ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు…

రెండు లక్షల సుపారి ఇచ్చి తన తమ్ముడైన శ్రీనివాస్ ని హతమార్చేందుకు తన బామ్మర్ది అయిన గోదరి సమ్మయ్యను,కిష్టస్వామిని సంప్రదించి,రంగంలోకి దించాడు…ఈ నెల 20 న శ్రీనివాస్ చెన్నూర్ కి వస్తున్నాడని తెలిసి అతడితో కలిసి సమ్మయ్య మద్యం సేవించి పథకం ప్రకారం గుప్త నిధుల తవ్వకాలు చేపట్టి బంగారం తీద్దామని,ఆశ చూపి చెన్నూర్ మండలంలోని సోమనపెల్లి అటవీ ప్రాంతంలోకి శ్రీనివాస్ తీసుకెళ్లి,కొంత దూరం వెళ్ళాక సమ్మయ్య గొడ్డలితో శ్రీనివాస్ పై దాడి చేశాడని ఏసీపీ చెప్పారు…

మెడ,చేతులు,కాళ్లపై గొడ్డలితో విచక్షణా రహితంగా నరికాడని,శ్రీనివాస్ తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ,సమ్మయ్య దాడి కొనసాగించి హతమార్చడాని,అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించారని,ఆనవాళ్లు దొరకకుండా మృతదేహంపై పెట్రోల్ పోసి అక్కడే దహనం చేసి ముగ్గురు పరారైనట్లు ఏసీపీ పేర్కొన్నారు…

అయితే ఈ నెల 21న శ్రీనివాస్ కనపడడం లేదంటూ,కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా,మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు…

దర్యాప్తులో భాగంగా సమ్మయ్యను విచారించగా అసలు విషయం బయటపడిందని,సోమనపెల్లి అటవీ ప్రాంతంలో శ్రీనివాస్ ని హతమార్చి మృతదేహాన్ని దహనం చేసినట్లు పోలీస్ విచారణలో తేలిందని,పోలీస్ బృందాలను రంగంలోకి దించి టెక్నికల్ ఏవిడెన్స్ తో నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు ఆయన చెప్పారు…

నిందితుల నుండి హత్యకు ఉపయోగించిన గొడ్డలి,రెండు మోటార్ సైకిళ్ళు,సెల్ ఫోన్,60 వేల నగదు,రక్తపు మరకలు ఉన్న దుస్తులను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు….

అనంతరం ముగ్గురు నిందితులను రిమాండ్ కి తరలించినట్లు ఆయన తెలిపారు….

కేసు చేదనలో ప్రతిభ కనబరిచిన పోలీసులను ఏసీపీ ప్రత్యేకంగా అభినందించారు….