భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..ఫామ్ హౌస్ లో పోలీసుల చిందులు..!
రికార్డుల్లో డ్యూటీ.. ఫామ్ హౌస్ లో బర్త్ డే పార్టీ..!
మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి:
బెల్లంపల్లి వన్ టౌన్ పోలీసుల వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
పోలీస్ స్టేషన్ రికార్డుల్లో విధుల్లో ఉన్నట్లు నమోదు చేసుకుని, విధులకు దూరంగా ఫామ్ హౌస్ లో జరిగిన బర్త్ డే పార్టీలో పాల్గొన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అంతేకాదు.. మద్యం మత్తులో పార్టీకి హాజరై చిందులు వేసినట్లు చెబుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో నెట్టింట చర్చకు దారితీస్తోంది.
ప్రజలకు భద్రత కల్పించాల్సిన బాధ్యతలో ఉన్న పోలీసుల వ్యవహారంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

వైరల్ వీడియోపై ఉన్నతాధికారులు విచారణ జరిపి నిజానిజాలు వెల్లడించాలని ప్రజలు కోరుతున్నారు.