భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..82 ఏళ్ల వృద్ధ వ్యాపారవేత్తకు హనీట్రాప్.. వీడియోలతో బ్లాక్మెయిల్!
82 ఏళ్ల వయసున్న ఓ వృద్ధ వ్యాపారవేత్తను లక్ష్యంగా చేసుకున్న యువతి.. వీడియో కాల్ ద్వారా పరిచయం పెంచుకుని, అతనితో సన్నిహితంగా ఉన్న దృశ్యాలను రహస్యంగా రికార్డ్ చేసింది. అనంతరం ఆ వీడియోలను బయటపెడతానంటూ బ్లాక్మెయిల్కు దిగింది.
పరువు పోతుందనే భయంతో తొలుత ఆమె అడిగిన రూ.2 లక్షలు చెల్లించిన వృద్ధుడు.. ఆ తర్వాత మరో రూ.10 లక్షలు డిమాండ్ చేయడంతో పోలీసులను ఆశ్రయించాడు.
ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు యువతిని అరెస్ట్ చేసి, గతంలో తీసుకున్న రూ.2 లక్షలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

⚠️ ఆన్లైన్ పరిచయాలు, వీడియో కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండండి. బ్లాక్మెయిల్కు భయపడి డబ్బులు చెల్లించకుండా వెంటనే పోలీసులను ఆశ్రయించండి.