భారత్ డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…..పవన్ కళ్యాణ్ పై అనుచిత పోస్టులు.. వ్యక్తి అరెస్ట్
Nov 12, 2026,
పవన్ కళ్యాణ్ పై అనుచిత పోస్టులు.. వ్యక్తి అరెస్ట్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన గుంటూరు జిల్లా వడ్డేశ్వరానికి చెందిన రవీంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ గౌరవానికి భంగం కలిగించడంతో పాటు, జనసేన పార్టీ కార్యకర్తలు, మద్దతుదారుల మధ్య విభేదాలు సృష్టించేలా ఆ వ్యక్తి పోస్టులు ఉన్నాయని పిఠాపురం జనసేన నాయకులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. అంతేకాకుండా, పవన్ వ్యక్తిగత జీవితంపై పోస్టులు పెట్టిన వారిపై కూడా పెద్ద సంఖ్యలో కేసులు నమోదైనట్లు సమాచారం
