భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం.మచిలీపట్నంలో ఎన్డీఏ స్థానిక సంస్థల సమన్వయ కమిటీ సమావేశం
మచిలీపట్నం: ఈరోజు తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం పార్లమెంట్ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్డీఏ సమన్వయ కమిటీ సమావేశం జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీ సుభాష్ గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశంలో జనసేన పార్టీ మచిలీపట్నం పార్లమెంట్ స్థానిక ఎన్నికల సమన్వయకర్త, అవనిగడ్డ శాసనసభ్యులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారితో కలిసి ఎన్డీఏ సమన్వయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ గారు, రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ చిలకలపూడి పాపారావు గారు,గన్నవరం నియోజకవర్గం,జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ చలమలశెట్టి రమేష్ బాబు గారు,వివిధ నియోజకవర్గాల జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు
అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున కృష్ణా జిల్లా అధ్యక్షులు శ్రీ వీరంకి గురుమూర్తి గారు, రాష్ట్ర ఎమ్మెల్సీ శ్రీ కోమలపాటి శ్రీధర్ గారు, శాసనసభ్యులు శ్రీ కృష్ణ ప్రసాద్ గారు, శ్రీ వర్ల కుమార్ రాజా గారు, ఇతర సమన్వయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
భారతీయ జనతా పార్టీ తరఫున జిల్లా అధ్యక్షులు శ్రీ తాటినేని రామచంద్రరావు గారు, శ్రీ సీహెచ్ కుమారస్వామి గారు, ఇతర నాయకులు పాల్గొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల మధ్య సమన్వయం, పరస్పర సహకారం, ఉమ్మడి కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చలు జరిగాయి.