భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..చలో విజయవాడ” కార్యక్రమానికి పోలీసుల అనుమతి లేదు
అనుమతి లేని కార్యక్రమాల్లో పాల్గొని శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దు – కృష్ణాజిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్.,
క్రైమ్ న్యూస్ కృష్ణా :
27.09.2026 తేదీన స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు ఉద్యోగులు నిర్వహించనున్న “చలో విజయవాడ” కార్యక్రమానికి పోలీసు శాఖ నుంచి ఎటువంటి అనుమతి మంజూరు కాలేదని కృష్ణాజిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్ గారు స్పష్టం చేశారు.
కృష్ణాజిల్లా నుంచి సదరు కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లే సమాచారం ఉన్న సంబంధిత స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు ఉద్యోగులకు పోలీసు అధికారులు నోటీసులు జారీ చేశారు. అనుమతి లేని కార్యక్రమంలో పాల్గొని శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఏ విధమైన చర్యలకు పాల్పడినా చట్ట ప్రకారం కఠినమైన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేశారు.
రాష్ట్రంలో ప్రస్తుతం వరదలు మరియు ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రజలకు త్రాగునీరు, పారిశుద్ధ్యం, ఇతర అత్యవసర సేవలు నిరంతరాయంగా అందించేందుకు స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు ఉద్యోగులు తమ హెడ్‌క్వార్టర్స్‌లో అందుబాటులో ఉండి విధులు నిర్వహించాలని ప్రభుత్వం Circular Rc.No.3435257/SGSW/(HR)/2026, తేదీ 25.09.2026 ద్వారా ఆదేశాలు జారీ చేసినట్లు ఎస్పీ గారు తెలిపారు.
ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ సంబంధిత ఉద్యోగులు తమ హెడ్‌క్వార్టర్స్‌లో అందుబాటులో ఉండి విధులు నిర్వహించాలని, ప్రస్తుత వరదలు మరియు ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలకు అవసరమైన అత్యవసర సేవలను ప్రజలకు అందించడంలో సహకరించాలని కోరారు.
అనుమతి లేని “చలో విజయవాడ” కార్యక్రమంలో పాల్గొని శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే, అమలులో ఉన్న చట్టాలు, నిబంధనల ప్రకారం తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న వారి వివరాలను సంబంధిత శాఖల అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరుగుతుందని తెలిపారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు అందాల్సిన అత్యవసర సేవలకు ఎటువంటి అంతరాయం కలగకుండా ప్రతి ఒక్కరూ పోలీసు మరియు ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని కృష్ణాజిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్ గారు విజ్ఞప్తి చేశారు.