ఏపీ హైకోర్టు వినూత్న శిక్ష

లింగపాలెం తహశీల్దార్కు ఏపీ హైకోర్టు వినూత్న శిక్ష

కోర్టు ఆదేశాలు అమలు చేయనందుకు లింగపాలెం తహశీల్దార్ నజీముల్లాషాకు హైకోర్టు కోర్టు ధిక్కరణ కింద తొలుత 7 రోజుల జైలు శిక్ష విధించింది.

న్యాయవాది అభ్యర్థన మేరకు శిక్షను సవరిస్తూ, 7 రోజుల పాటు అనాథాశ్రమంలో సేవ చేయాలని, లీగల్ సర్వీసెస్ కమిటీకి రూ.2,000 జరిమానా చెల్లించాలని ఆదేశించింది. సేవ చేసిన ఆధారాలను తదుపరి విచారణలో సమర్పించాలని స్పష్టం చేసింది.