భారత్ డిజిటల్ న్యూస్) స్వచ్ఛత సేవ కార్యక్రమంలో భాగంగా గురువారం తిరుపతి జిల్లా పాకాల మండలం కావలివారిపల్లి గ్రామంలో స్వచ్చత శ్రమదానము నిర్వహించబడినది. ఈ కార్యక్రమంలో సింగల్ విండో చైర్మన్ క్రిష్ణమనేని సావిత్రి ప్రజా ప్రతినిధులు, ప్రజలు, మరియు ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొని ఈ కార్యక్రమము విజయవంతం చేశారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 16 వ తేదీ నుండి మొదలు అక్టోబర్ 2 వ తేదీన ముగుస్తుంది. ఇలాంటి కార్యక్రముముల వలన గ్రామ పంచాయతీ పరిసరాలు పరిశుభ్రత చేపట్టడంతో పాటు మన చుట్టు ప్రక్కల గల పర్యావరణం ఆరోగ్యవంతంగా మారుతుంది అని సింగిల్ విండో చైర్మన్ తెలియజేశారు.
