భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..రూ.32.49 లక్షల కోట్లకు చేరిన పెట్టుబడులు: చంద్రబాబు…
ఆంధ్రప్రదేశ్ : విశాఖపట్నంలో జరిగిన సీఐఐ సదస్సులో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రెండు రోజుల సదస్సు, ప్రాంతీయ సమావేశాల ద్వారా రాష్ట్రానికి రూ.9.89 లక్షల కోట్ల విలువైన 303 అవగాహన ఒప్పందాలు కుదిరినట్లు వెల్లడించారు.

2024 జూన్ నుంచి ఇప్పటివరకు ఏపీ రూ.22.6 లక్షల కోట్ల పెట్టుబడుల పైప్‌లైన్‌ను సిద్ధం చేసుకుందని చంద్రబాబు తెలిపారు. తాజా పెట్టుబడి ప్రతిపాదనలతో ఈ మొత్తం రూ.32.49 లక్షల కోట్లకు చేరిందని, దేశంలోనే ఇదే అత్యధికమని పేర్కొన్నారు…