భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..ప్రాణాలు కాపాడేందుకు నమాజ్ ఆపాల్సిందే: జోర్డాన్ ఫత్వా
జోర్డాన్‌లోని జర్కా సిటీలో అలీ అబు అరబ్ అనే వ్యక్తి నమాజ్ చేస్తూ మరణించిన ఘటన తీవ్ర చర్చకు దారి తీసింది. అతడు కుప్పకూలిపోయినా మిగతా వారు పట్టించుకోకుండా ప్రార్థన కొనసాగించారు.

ఈ నేపథ్యంలో జోర్డాన్ ప్రభుత్వం కీలక ఫత్వా జారీ చేసింది. ‘ఓ వ్యక్తి ప్రమాదంలో ఉంటే అతడిని కాపాడేందుకు ప్రార్థనను ఆపడం తప్పనిసరి’ అని పేర్కొంది. ఇస్లామిక్ సిద్ధాంతాల ప్రకారం మానవుల ప్రాణాలు అత్యంత విలువైనవని స్పష్టం చేసింది….