టాప్ అకాడమీ, బెంగళూరు క్యాంపస్ డ్రైవ్‌లో ఇంటర్నన్షిప్ అవకాశం పొందిన 20 మంది విద్యార్థులు

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..టాప్ అకాడమీ, బెంగళూరు క్యాంపస్ డ్రైవ్‌లో ఇంటర్నన్షిప్ అవకాశం పొందిన 20 మంది విద్యార్థులు
*తిరువూరు: శ్రీ వాహిని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, తిరువూరులో అక్టోబర్ 30న నిర్వహించిన టాప్ అకాడమీ (TAP Academy) క్యాంపస్ ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లో 20 మంది బీటెక్ విద్యార్థులకు ఉచిత ఇంటర్నన్షిప్ అవకాశం లభించింది

కళాశాల ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నియామక కార్యక్రమంలో వివిధ ఇంజినీరింగ్ విభాగాలకు చెందిన విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు.ఎంపికైన విద్యార్థులకు నాలుగు నుంచి ఆరు నెలల పాటు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ శిక్షణ ఇచ్చి అనంతరం సంబంధిత కంపెనీలో ఉద్యోగాలకి పంపించడం జరుగుతుంది

ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ శ్రీ పసుమర్తి వెంకటేశ్వరరావు, కార్యదర్శి శ్రీ ఉటుకూరి సుబ్రహ్మణ్యం, కరస్పాండెంట్ శ్రీ పొట్రు నాగేశ్వరరావు, ట్రెజరర్ శ్రీ ముత్యాల కిషోర్ బాబు, ప్రిన్సిపాల్ డా. రంగ నాగేంద్రబాబు ఎంపికైన విద్యార్థులను అభినందించారు.
ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ అధికారులు, ఎం.హెచ్. సత్యప్రసాద్, షేక్ షరీఫ్ విభాగాధిపతులు అధ్యాపకులు విద్యార్థులను అభినందించారు.