భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..విజయవాడ
వైఎస్ షర్మిలా రెడ్డి
APCC చీఫ్
అసలైన ప్రతిపక్ష పాత్ర పోషించాలని, గెలుపొందిన మన కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులు అంకితభావంతో పనిచేస్తారని ఆశిస్తున్నాను.
44 స్థానాల్లో భాగంగా, 42 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టి,
10 స్థానాలను గెలిపించి..
మిగతా స్థానాల్లో సైతం పార్టీని రెండో స్థానంలో నిలబెట్టడంలో ప్రత్యక్ష పాత్ర పోషించిన ..
జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర PAC సభ్యులు, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు.
కాంగ్రెస్ సారథ్యంలో, చీరాలలో అభ్యర్థుల గెలుపు మీ కష్టానికి దక్కిన ప్రతిఫలం.
స్థానికంగా ప్రజా సమస్యలపై మీ అకుంఠిత పోరాట పటిమకు నిదర్శనం.
చీరాల మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం.. నిజమైన ప్రజాస్వామ్య విజయం.
రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీనే ఇక ప్రత్యామ్నాయం అనడానికి ఇదొక సంకేతం.
ప్రజల గొంతుకను నొక్కిపట్టాలని చూసిన కూటమి శక్తులను ఎదురించి,
అధికార బలాన్ని తట్టుకుని, ప్రలోభాలకు లొంగకుండా,
ప్రజా పక్షాన నిలిచి పోరాడి గెలిచిన మన వార్డు సభ్యులకు, అహర్నిశలు శ్రమించిన కార్యకర్తలకు అభినందనలు.
కాంగ్రెస్ అభ్యర్థులను నమ్మి ఓటేసి గెలిపించిన చీరాల ప్రజలకు పేరు పేరునా కృతజ్ఞతలు 🙏.
మున్సిపాలిటీ పీఠాన్ని కైవసం చేసుకోలేక పోయినా,
గౌరవ ప్రదమైన స్థానాలు దక్కించుకొని, ప్రతిపక్ష పాత్ర పోషించబోతున్న కాంగ్రెస్ దే చీరాలలో అసలైన నైతిక విజయం.
చీరాల ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ,

కూటమి నిర్లక్ష్యాన్ని ఎప్పటికప్పుడు ఎండగట్టే విధంగా,