భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..విశాఖ స్టీల్ ప్లాంట్‌లో మరో ప్రమాదం..!
కాంట్రాక్టు కార్మికుడికి 90% కాలిన గాయాలు.. పరిస్థితి విషమం..!
విశాఖపట్నం:
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో మరో ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత విధుల్లో ఉన్న కాంట్రాక్టు కార్మికుడు దుంబరి దేముడుపై వేడి ద్రవం పడటంతో తీవ్రంగా గాయపడ్డారు.
విజయనగరం జిల్లా కొండగంగుపూడికి చెందిన దేముడు (37) శరీరంపై సుమారు 90 శాతం కాలిన గాయాలైనట్లు సమాచారం. వెంటనే ఆయనను నగరంలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రస్తుతం దేముడు పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వరుస ప్రమాదాలు స్టీల్ ప్లాంట్ కార్మికుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.

కార్మికుల భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలపై అధికారిక వివరణ రావాల్సి ఉంది.