ఆంధ్రప్రదేశ్ DSC 2026 నోటిఫికేషన్ విడుదల – మొత్తం 2,721 టీచర్ పోస్టులు!

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు…..ఆంధ్రప్రదేశ్ DSC 2026 నోటిఫికేషన్ విడుదల – మొత్తం 2,721 టీచర్ పోస్టులు!

ఏపీ పాఠశాల విద్యాశాఖ ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి అధికారిక DSC-2026 నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

🔹 మొత్తం ఖాళీలు: 2,721 పోస్టులు

  • జనరల్ డీఎస్సీ: 2,111
  • స్పెషల్ ఎడ్యుకేషన్: 350
  • సొసైటీస్ పోస్టులు: 260

🔹 భర్తీ చేసే పోస్టులు:
School Assistant (SA), Secondary Grade Teacher (SGT), PGT, TGT, Principal, PET & PD.

🔹 ముఖ్యమైన తేదీలు & వివరాలు:

వయోపరిమితి: OC అభ్యర్థులకు గరిష్ఠంగా 44 సంవత్సరాలు (SC/ST/BC/EWS వారికి 49 సంవత్సరాలు)…

దరఖాస్తు ప్రారంభం: 11 నవంబర్ 2026

దరఖాస్తుకు చివరి తేదీ: 30 నవంబర్ 2026

కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (CBT): 20 డిసెంబర్ 2026 నుంచి 13 జనవరి 2027 వరకు

దరఖాస్తు ఫీజు: ఒక్కో పోస్టుకు ₹1,000