భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..విద్యుత్ ట్రూ-అప్ ఛార్జీలు వసూలు.. వినియోగదారులపై భారం
T.G : నవంబర్ నెల నుండి విద్యుత్ వినియోగదారులపై ట్రూ-అప్ ఛార్జీల భారం పెరిగింది.
2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో విద్యుత్ కొనుగోలు వ్యయం పెరగడంతో, ఆ లోటును పూడ్చుకునేందుకు డిస్కమ్‌లు ఈ ఛార్జీలను వసూలు చేస్తున్నాయి.
ప్రస్తుతం యూనిట్‌కు 30 పైసల చొప్పున వసూలు చేస్తుండగా, వచ్చే నెల నుంచి 50 పైసలకు పెంచనున్నారు.

ఈ విధానం సుమారు 26 నుండి 29 నెలల పాటు కొనసాగుతుందని పేర్కొన్నారు. తమపై పాత బకాయిల భారం వేయడంపై వినియోగదారులు, ముఖ్యంగా అద్దెదారులు, చిన్న వ్యాపారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.